
విజేతలతో అధికారులు
రాజానగరం: అటవీ శాఖలో ఉన్న వారికి క్రీడలు, యోగా, వ్యాయామం వంటివి ఆరోగ్య పరిరక్షణతోపాటు విధి నిర్వహణలో అంకితభావాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని ఏపీ స్టేట్ ఫారెస్టు అకాడమీ డైరెక్టర్ పీఏవీ ఉదయ్ భాస్కర్ అన్నారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న ఫారెస్టు సెక్షన్ అధికారులు, ఫారెస్టు బీట్ అధికారులకు బుధవారం గేమ్స్ అండ్ స్పోర్ట్సు మీట్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అకాడమీ డైరెక్టర్ మాట్లాడుతూ అకాడమీలో ఆరు మాసాలు, ఏడాది కాలం శిక్షణ పొందే ఉద్యోగులకు క్రమబద్ధమైన, ఆరోగ్యవంతమైన జీవిత విధానాన్ని అలవాటు చేయడం కోసం వీటిలో ప్రతిరోజు శిక్షణ కూడా ఇస్తామన్నారు. రన్నింగ్, షాట్ ఫుట్, జావోలిన్ త్రో, డిస్కస్ త్రో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, తదితర క్రీడలలో విజేతలను ప్రకటించి బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో స్పోర్ట్సు ఇన్‌చార్జి టి.చక్రపాణి, ఏసీఎఫ్‌లు ఎన్‌వీ శివరామప్రసాద్, వి.శ్రీహరి గోపాల్, ఏవీ రమణమూర్తి, టి.శ్రీనివాసరావు, రేంజ్ అధికారి టి.అనూష పాల్గొన్నారు.