
సమావేశంలో పాల్గొన్న రామనాథరావు తదితరులు
రాజమహేంద్రవరం సిటీ: సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ నివారణకు ముందస్తు ప్రణాళిక అవసరమని మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు అధికారులకు పిలుపు నిచ్చారు. పూర్వపు తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు చెందిన డీఎంఓ, ఏఎంఓ తదితర అధికారులతో జోనల్ మలేరియా అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి నేతృత్వంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. కార్యక్రమంలో జోనల్ అడిషనల్ డైరెక్టర్ బీఎల్‌ఎన్ కుమార్ పాల్గొన్నారు.
ఉపకరణాల పంపిణీకి
నిర్ధారణ పరీక్షలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) స్థానిక ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా సమగ్రశిక్ష,సహిత విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్ధులకు ఉపకరణాలు పంపిణీకి నిర్థారణ వైద్యశిబిరం నిర్వహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.సుబ్బారావు కోరారు. స్కూల్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు దివ్యాంగ విద్యార్థులకు పరీక్షలు చేసి ఉపకరణాల వివరములను తెలియజేశారన్నారు. సహిత విద్య కోఆర్డినేటర్ జి స్నేహలత మాట్లాడుతూ పది మండలాల నుంచి 66 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారన్నారు.