
విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఒక ఇంటర్మీడియెట్ విద్యార్థిని పరీక్షలు రాయడానికని వెళ్లి అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ విద్యార్థిని చేబ్రోలు ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. మంగళవారం ఉదయం ఇంటర్ పరీక్షలు రాయడానికని ఆటోలో పిఠాపురం వెళ్లింది. సాయంత్రం అవుతున్నా ఆమె తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వినయ్‌ప్రతాప్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. విద్యార్థిని పరీక్షలు రాయడానికి వెళ్లిన ఆటో డ్రైవర్‌ను విచారించగా.. పరీక్షలకు తీసుకువెళ్లి, తరువాత ఇంటికి తీసుకువచ్చి దింపేశానని చెప్పాడు. ఆమె ఆచూకీ కోసం ిపిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తన సిబ్బందితో ప్రయత్నం ఆరంభించారు. ఆమె స్నేహితులను విచారిస్తున్నారు.