
సభలో మాట్లాడుతున్న జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్
జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్
మలికిపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకుందామని జనసేన పార్టీకి చెందిన రామరాజులంక గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్ అన్నారు. కత్తిమండలోని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు పేదరికం రూపు మాపే విధంగా, పేద కుటుంబాలకు ఎంతో అండగా, ఆసరాగా ఉంటున్నాయని అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేరని కొనియాడారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు దేశంలో ఎక్కడా లేదని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్ లాంటి ముఖ్యమంత్రిని అందరం కాపాడుకోవాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేద్వామని అన్నారు.
మోసం చేసిన 11 మందిపై కేసు
అయినవిల్లి: ఇటుకబట్టీలో పనిచేస్తామని బట్టీ యజమాని వద్ద రూ.4.70 లక్షలు అడ్వాన్సు తీసుకుని మోసగించిన 11 మందిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్. నాగేశ్వరరావు తెలిపారు. అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామానికి చెందిన ముళ్లపూడి జనార్దనరావు వద్ద పిఠాపురానికి చెందిన కుమ్మరి రాంబాబు మరో పది మంది తన ఇటుక బట్టీలో పనిచేస్తామని చెప్పి రూ.4.70 లక్షలు తీసుకుని మోసగించారని ఫిర్యాదు చేశాడు. దీని పై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.