
ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు చెక్కు అందజేస్తున్న చైతన్యబాబు, ఆర్యన్
మండపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ హాలు నిర్మాణానికి స్థానిక మాధవి ఎడిబుల్ ఆయిల్స్ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్టు ద్వారా మాధవి ఎడిబుల్ ఆయిల్స్ అధినేత వీవీవీఎస్ చౌదరి (మాధవిబాబు), సంస్థ ఈడీ, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, డైరెక్టర్, వైఎస్సార్ సీపీ నేత కృష్ణచైతన్య పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డిగ్రీ కళాశాల లైబ్రరీ హాలు నిర్మాణానికి అధికారులు రూ.19.87 లక్షలతో అంచనాలు రూపొందించారు. ఈ మేరకు చెక్కును ప్రిన్సిపాల్ టీకేవీ శ్రీనివాసరావుకు బైపాస్ రోడ్డులోని మాధవి ఎడిబుల్ ఆయిల్స్ ఫ్యాక్టరీ కార్యాలయంలో డైరెక్టర్ వేగుళ్ల చైతన్యబాబు, వేగుళ్ల ఆర్యన్ మంగళవారం అందజేశారు. లైబ్రరీ హాలు నిర్మాణం అనంతరం అందులో పుస్తకాల కోసం మరో రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. సంస్థ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వంక ప్రసాద్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్, అధ్యాపకులు పాల్గొన్నారు.