
పోటీలకు ఎంపికై న క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాజస్థాన్‌లోని కోటాలో ఈ నెల 28 నుంచి 31 వరకూ జరిగే జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు హాజరవుతున్నారు. తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు సోమవారం ఈ విషయం మీడియాకు తెలిపారు. బాలుర విభాగంలో బి.నాగదీపక్ చరణ్, వీసీఎస్ ఆదిత్యనాగ్, బి.హర్షవర్ధన్, బాలికల విభాగంలో బి.శ్రీస్నేహ, పి.హేమశ్రీనిధి, పి.దేవకి ఎంపికయ్యారన్నారు. శ్రీనగర్ మున్సిపల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న తైక్వాండో శిక్షణ కేంద్రంలో అర్జునరావు వద్ద వీరు శిక్షణ పొందుతున్నారు. ఎంపికై న క్రీడాకారులను డీఎస్‌ఏ చీఫ్ కోచ్ శ్రీనివాస్‌కుమార్, ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పద్మనాభం, తైక్వాండో నేషనల్ రిఫరీలు బి.అభిషేక్, బి.అఖిల, సత్యనారాయణ, తైక్వాండో సంఘ అధ్యక్షుడు మధుసుదన్‌రావు, ఉపాధ్యక్షుడు సుధాకరరావు అభినందించారు.
రైలు ఢీకొని
వృద్ధ దంపతుల మృతి
మియాపూర్(హైదరాబాద్): కూతురు వద్దకు వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వెళ్తున్న వృద్ధ దంపతులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందారు. ఈ దుర్ఘటన హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన వెంకటరావు(65), అనంతలక్ష్మీ(60) దంపతులు.
పదిరోజుల కిందట చిల్కూర్‌లో ఉంటున్న కుమార్తె కుమారి దగ్గరకు వెళ్లారు. సోమవారం ఉదయం చిల్కూర్ నుంచి బయల్దేరి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 5:20 గంటల సమయంలో ఫస్ట్ ప్లాట్‌పారం నుంచి దిగి రెండవ ప్లాట్‌పారానికి పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా శంకర్‌పల్లి వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ వృద్ధ దంపతులను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సాయంత్రం 7:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపూర్ ట్రైయిన్‌కు వెళ్లేందుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.