
ప్రధాన హుండీ నిండిపోవడంతో సీల్ వేస్తున్న సిబ్బంది
అన్నవరం: సత్యదేవుని ఆలయంలోని హుండీలను మంగళవారం లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 27న లెక్కించారు. 58 రోజుల తరువాత ఇప్పుడు లెక్కించనున్నారు. సుమారు రూ. 3 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధానాలయంలోని ప్రధాన హుండీ కానుకలతో నిండిపోవడంతో ఈ నెల 14న సీల్ వేశారు. వివాహాల సీజన్ కారణంగా కొద్ది రోజులుగా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. హుండీ లెక్కింపులో దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ చంద్ర శేఖర్ అజాద్, ఇతర సిబ్బంది పాల్గొంటారు.