ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో మూడు నెలలు

కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం - Sakshi

జూన్‌ 30 వరకు గడువు పెంపు

జిల్లాలో రూ.3929.48లక్షల ఆదాయం

పెండింగ్‌లో 2,261 దరఖాస్తులు

ఇవి పరిష్కారమైతే మరింత రెవెన్యూ

కొవ్వూరు: పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలోని అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌) ఈ ఏడాది జనవరి 31వ తేదీతో ముగిసింది. ఈ గడువును జూన్‌ 30 వరకు గడువు పొడిగిస్తూ పురపాలక శాఖ అఽధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో పాటు కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంఘాలు,రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ (రుడా)కు ఎల్‌ఆర్‌ ఎస్‌కు 4,540 దరఖాస్తులందాయి. వీటిలో 1,563 ఆమోదం పొందాయి. 238 దరఖాస్తులను తిరస్కరించారు. పెడింగ్‌లో ఉన్న 2,261 దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వ మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. చిన్న చిన్న లోపాలన్న దరఖాస్తులు 366 ఉన్నాయి. 112 దరఖాస్తులకు సొమ్ము చెల్లించాలని సిఫారసు చేశారు. ఎస్‌ఆర్‌ఎస్‌ ద్వారా పురపాలక సంఘా లకు రూ.3929.48 లక్షల ఆదాయం సమకూరింది. పెడింగ్‌ దరఖాస్తులు కుడా పరిష్కారమైతే అదనపు ఆదాయం సమకూరనుంది.

షార్ట్‌ఫాల్‌లో 366 దరఖాస్తులు

సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం, చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న దరఖాస్తుదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 97, కొవ్వూరులో 39, నిడదవోలులో 7, రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆఽథారిటీ(రుడా) పరిధిలో 223 మంది దరఖాస్తుదారులకు అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. రాజమహేంద్రవరంలో 25 మంది, కొవ్వూరులో 11, నిడదవోలులో 10 దరఖాస్తు దారులకు సొమ్ము చెల్లించాలని సమాచారం ఇచ్చారు. ఇవన్నీ క్లియరైతే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

పెండింగ్‌ దరఖాస్తులు

రుడా పరిధిలో 2,208 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3,290 దరఖాస్తులు అందితే 625 ఆమోదం పొందాయి. 168 దరఖాస్తులకు సరైన పత్రాలు లేకపోవడంతో తిరస్కరించారు. ఇప్పటివరకు రుడాకు రూ.1,196.5 లక్షల మేరకు ఆదాయం సమకూరింది. 2233 దరఖాస్తుదారులకు లోపాలను సరిచేసి సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. 66 మంది సొమ్ము చెల్లింపు పెండింగ్‌ దశలో ఉంది.

పాత వారికే వర్తింపు

జిల్లాలో 2,261 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం లేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే గడువు వర్తిస్తుంది. సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం,చిన్నచిన్న లోపాలు గుర్తించి నోటీసులు పొందిన వారు సరిచేసి సొమ్ము చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌ దరఖాస్తుదారులు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి.

– ఎన్‌.శ్రీనివాస్‌, రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌

ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌

మునిసిపాలిటీల వారీగా దరఖాస్తుల తీరు

మునిసిపాలిటీ దరఖాస్తులు అప్రూవ్డ్‌ తిరస్కరణ లోపాలున్నవి పెండింగ్‌

రాజమహేంద్రవరం 767 565 64 97 16

కొవ్వూరు 347 264 06 39 27

నిడదవోలు 136 109 0 07 10

రుడా 3,290 625 168 223 2,208

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top