మమ్మేలుకోవా సీతారామా..! | - | Sakshi
Sakshi News home page

మమ్మేలుకోవా సీతారామా..!

Mar 28 2026 7:25 AM | Updated on Mar 28 2026 7:25 AM

కన్నుల పండువగా కళ్యాణం మహోత్సవం

సీతమ్మకు సమర్పించిన కోవా కంత

సీతారాముల కల్యాణం జరిపిస్తున్న పండితులు

పి.గన్నవరం: స్థానిక పాత అక్విడెక్టు వద్ద కొలువైన పట్టాభి రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణానికి భక్తజనం భారీగా తరలివచ్చారు వాడపల్లి రాంబాబు అర్చకత్వంలో వైనతేయ నదీ తీరాన జరిగిన కల్యాణానికి సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో కోవాతో చేసిన వంద రకాల స్వీట్లు, అంతకు మించి పిండి వంటలను రామయ్య తరఫున సీతమ్మతల్లికి సారె (కంత) సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమాతో పాటు పరిసర గ్రామాల భక్తులు పాల్గొనగా వారికి అన్నసమారాధన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement