వరల్డ్‌ ఎక్స్‌లెన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు | - | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ఎక్స్‌లెన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

Dec 13 2025 7:58 AM | Updated on Dec 13 2025 7:58 AM

వరల్డ

వరల్డ్‌ ఎక్స్‌లెన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

ముమ్మిడివరం: న్యూ ఢిల్లీకి చెందిన వరల్డ్‌ ఎక్స్‌లెన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ప్రముఖ గ్లోబల్‌ ఇంగ్లిష్‌ ట్రైనర్‌, ముమ్మిడివరానికి చెందిన జేవీఎల్‌ నరసింహారావుకు చోటు దక్కింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి సుజల్‌ కుమార్‌ యాదవ్‌ నుంచి ఉత్తర్వులు అందాయని నరసింహారావు తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, భాషా నిపుణుడిగా, ఉపాధ్యాయ శిక్షకుడిగా, పాఠ్య పుస్తక రచయితగా కృషి చేసినందుకు ఈ అవకాశం దక్కిందన్నారు. ఇదివరకూ 22 అవార్డులు, మూడు ప్రపంచ రికార్డులు ఆంగ్ల బోధనా రంగంలో చేసిన కృషికి లభించాయన్నారు.

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్‌, సివిల్‌, కుటుంబ వివాదాలు, చెక్‌ బౌన్స్‌, యాక్సిడెంట్‌, బ్యాంకుల కేసులు, ప్రీ లిటిగేషన్‌ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. దీని కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ చలానా కేసులను కూడా లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అలాగే, ఎకై ్సజ్‌ శాఖకు సంబంధించిన డ్యూటీ పెయిడ్‌, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ కేసులను కూడా రాజీ ద్వారా ముగించుకోవచ్చన్నారు. ఈ లోక్‌ అదాలత్‌లో రాజీ పరిష్కారానికి మొత్తం 18,035 కేసులను గుర్తించామని సునీత తెలిపారు.

టెట్‌కు 436 మంది హాజరు

రాయవరం: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 436 మంది హాజరయ్యారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల, అమలాపురంలోని బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం పరీక్షకు 250 మంది హాజరు కావాల్సి ఉండగా 213 మంది, మధ్యాహ్నం 250 మంది రావాల్సి ఉండగా 223 మంది వచ్చారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని డీఈఓ పి.నాగేశ్వరరావు తెలిపారు.

నేడు జవహర్‌

నవోదయ ప్రవేశ పరీక్ష

రాయవరం: జిల్లాలో శనివారం జవహర్‌ నవోదయ విద్యా సమితిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 15 కేంద్రాల్లో 3,046 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. రామచంద్రపురం డివిజన్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పిల్లావారి వీధి మున్సిపల్‌ హైస్కూల్‌, మండపేట ప్రభుత్వ పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష జరుగనుంది. కొత్తపేట డివిజన్‌లో రావులపాలెంలోని బాలుర, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలు, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, పి.గన్నవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమలాపురం డివిజన్‌లో ము మ్మిడివరంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, వెత్సావారి అగ్రహారంలోని ఎంజీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, కొంకాపల్లిలోని జేఎన్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, అమలాపురంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, రాజోలులో జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. 15 కేంద్రాలకు సీఎస్‌, డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.హనుమంతరావు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ పి.నాగేశ్వరరావు సూచించారు.

సరకుల తూకాల్లో

తేడాలు రానీయొద్దు

అమలాపురం రూరల్‌: రేషన్‌ సరకుల తూకాల్లో తేడాలు రాకుండా చూడాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో రేషన్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ డీలర్లతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతతూ గ్యాస్‌, రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్యాస్‌ డెలివరీ బాయ్‌లు అదనపు సొమ్ము వసూలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఎ.ఉదయ భాస్కర్‌ మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌, డెలివరీ వివరాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. మీటర్‌తో తూకం వేయడం సిలిండర్‌ సీల్‌ సరిగా ఉందో లేదో లబ్ధిదారుల ఎదుటే చూపాలన్నారు. కార్యక్రమంలో డీలర్లు బాబి, త్రినాఽథ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వరల్డ్‌ ఎక్స్‌లెన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు 1
1/1

వరల్డ్‌ ఎక్స్‌లెన్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement