వేతనాలు పెంచాలని అంగన్‌వాడీల ధర్నా
అమలాపురం రూరల్: తమ వేతనాలు పెంచాలని కోరుతూ అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలకి్‌ష్మ్ అధ్యక్షతన జరిగిన సభలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడారు. అంగన్‌వాడీలకు ఐదేళ్లుగా అదే వేతనాలు ఇవ్వడం దారుణమన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చినప్పటికీ వారికి ఇంత వరకూ పెరిగిన వేతనాలు ఇవ్వడం లేదన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ గ్రాట్యూటీతో పాటు అర్హులైన సహాయకులకు పదోన్నతులు కల్పించాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరామ్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీటీపీ తాము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని వాగ్దానం చేసిందని, కానీ ఇప్పటి వరకూ పెంచలేదన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, అన్ని యాప్‌లు కలిపి ఒక యాప్‌గా మార్చాలని, సెంటర్ నిర్వహణకు 5జీ ఫోన్లు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు టి.నాగవరలక్ష్మి, ఎం.దుర్గమ్మ, రాణి, బేబీ, సుశీల, ఎ.వెంకటలకి్‌ష్మ్, ఎం.రత్నకుమారి, కె.విజయ, కె.సుజాత, ఆర్.రత్నకుమారి, జయలకి్‌ష్మ్, నూకరత్నం, ఎం.సూర్యకుమారి, ఎం.కమల, సీఐటీయూ నాయకుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


