వ్యక్తి ఆత్మహత్య
రౌతులపూడి: ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన అల్లం రమేష్ (32) రాజవరం శివారున రౌతులపూడి నుంచి కోటనందూరు వెళ్లే రహదారి పక్కన ఉన్న మామిడితోటలో చెట్టుకు శుక్రవారం ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి అల్లం నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రౌతులపూడి ఎస్‌ఐ వెంకేటేశ్వరరావు తన సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమేష్‌కు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
15 మందికి జైలు
కాకినాడ లీగల్: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో ఒకరికి పది రోజులు, ఒకరికి నాలుగు రోజులు, 8 మందికి మూడు రోజులు, ఐదుగురికి రెండు రోజుల చొప్పున శిక్ష విధిస్తూ కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో 15 మందిని హాజరుపర్చగా వారికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
బీసీ బహిరంగ సభను
విజయవంతం చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న రావులపాలెం సమీపంలోని ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడలో బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లను పెంచి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్‌బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. సమావేశంలో యనమదల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకరరావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకే రాజు, పెంకే శివ, పెంకే వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
కుదిరిన ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే.


