అట్టహాసంగా సెపక్‌తక్రా పోటీలు
ప్రతిజ్ఞ చేస్తున్న క్రీడాకారులు
మైదానంలో హోరాహోరీగా తలపడుతున్న క్రీడాకారులు
దేవరపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ అంతర్ జిల్లాల సెపక్‌తక్రా చాంపియన్ షిప్ 2025–26 అండర్ 17 బాల, బాలికల పోటీలు దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జెడ్పీ హైస్కూలు క్రీడా మైదానంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, విద్యాశాఖ ఆర్‌జేడీ జి. నాగమణి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగనున్న పోటీలకు రాష్ట్రంలోని పూర్వపు 13 జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు, 52 మంది కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో రీజినల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్పెక్టర్ జాన్సన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే మెహబూబా బాషా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బాలమూర్తి, జిల్లా కార్యదర్శి ఏడీవీ ప్రసాద్, డీవైఈఓ రమణరావు, ఎంఈఓ ఎం.తిరుమలదాస్, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, హెచ్‌ఎం పి.వీర్రాజు, విద్యాకమిటీ చైర్మన్ పావాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెంకట్రాజు మాట్లాడుతూ క్రీడలు విద్యలో అంతర్భాగమని పేర్కొన్నారు. నాయకులు పాఠశాలలను దత్తత తీసుకుని క్రీడల అభివృద్ధికి వసతులు కల్పించాలని ఆయన కోరారు. ఈ నెల 28న దేవరపల్లిలో నిర్వహిస్తున్న గ్రామీణ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఉమ్మడి 13 జిల్లాల నుంచి
150 మంది క్రీడాకారుల హాజరు
అట్టహాసంగా సెపక్‌తక్రా పోటీలు


