‘చెకుముకి’ పరీక్షలు ప్రారంభం
ముమ్మిడివరం: విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి అవగాహన పెంపొందేలా జన విజ్ఞాన వేదిక ఏటా జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందని జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బీర హనుమంతరావు పేర్కొన్నారు. ముమ్మిడివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం చెకుముకి పాఠశాల స్థాయి పరీక్షలను ఆయనతో పాటు జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు జనిపెల్ల సత్యనారాయణ, కన్వీనర్ ఎన్.అబ్బులు ప్రారంభించారు. హనుమంతరావు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చిన శాస్త్ర విజ్ఞాన దృక్పథాన్ని ప్రజల్లోనూ, విద్యార్థులలోనూ పెంపొందించడానికి ఈ వేదిక కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 26 యూనిట్ల నుంచి 372 పాఠశాలల్లో మొత్తం 26,850 మంది 8, 9, 10 తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారన్నారు. మండల స్థాయిలో నవంబరు 1 నుంచి, నవంబరు 23నుంచి జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మత్స్యకారులు
చేపల వేటకు వెళ్లొద్దు
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: ఆగ్నేయ బంగాళాఖాతం చుట్టూ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో మంగళవారం నుంచి చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు దక్షిణ అరేబియా సముద్రం మధ్య భాగంలో, బుధవారం నైరుతి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం అల్లకల్లోలంగా దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోకి మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ల వద్దని సూచించారు. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణించి 48 గంటల్లో దక్షిణ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ–మధ్య బంగాళాఖాతం మధ్య వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.
జిల్లా క్రీడా అభివృద్ధి
అధికారిగా వైకుంఠరావు
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు కొత్తగా డీఎస్‌వోగా వైకుంఠరావు రుద్ర బాధ్యతలు చేపట్టారు. ఆయన కలెక్టర్‌ను శనివారం మర్యాదపూర్వరంగా కలిశారు. ఇటీవల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా వైకుంఠరావు పదోన్నతి పొందారు. వైకుంఠరావు 2009లో కాకినాడలో బాస్కెట్‌బాల్ కోచ్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన అనేక మంది ఆటగాళ్లను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు.
‘చెకుముకి’ పరీక్షలు ప్రారంభం


