
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎౖక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతా డ లావణ్యకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం కొంతమూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై గల నయరా పెట్రోల్ బంక్ సమీపంలో ఎకై ్సజ్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో 220 కేజీల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన నాగరాజు, సుబ్రహ్మణ్యం, జైసల్వాలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నార్త్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.హనుశ్రీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఎస్సై సీహెచ్ రాజేష్, ఎం.శ్రీనివాసరావు, ఏ.రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.