
అచ్చెన్న వ్యాఖ్యలు అన్యాయం
ఆడబిడ్డ నిధిపై బాధ్యతాయుతమైన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అన్యాయం. ఆ పథకం అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అంటారు? రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో లెక్కా పత్రం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారు? అంటే ప్రజలను నిలువునా వంచన చేసి ఓట్లు వేయించుకోవడం కాదా? అధికారంలోకి వచ్చేశామనే ధైర్యంతో ఇప్పుడు ఇలా మాట్లాడతారా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు.
– రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్,
వైఎస్సార్ సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి.
కౌడా మాజీ చైర్‌పర్సన్. కాకినాడ
ఆడబిడ్డలంటే అంత అలుసా?
ఎన్నికల ముందు 18 ఏళ్లు నిండిన ఆడ బిడ్డలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక ఇప్పుడు ఇవ్వలేమని పరోక్షంగా చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆ పథకాన్ని అమలు చేస్తే ఏపీనే అమ్మాలన్న కామెంట్ కూడా సరైనది కాదు. రాష్ట్రంలోని ఆడబిడ్డలంటే అంత అలుసా?.. ఆడబిడ్డల నిధి పథకం అమలుకు వచ్చే సరికే మీకు ఆర్థిక భారమా? అది అధికారం చేపట్టిన ఏడాది తర్వాతే తెలిసిందా? మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరాలి. లేకుంటే ఆందోళనకు దిగుతాం.
–టి.నాగవరలక్ష్మి, కార్యదర్శి, ఐద్వా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

అచ్చెన్న వ్యాఖ్యలు అన్యాయం