
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. నిల్వల్లో తేడాలను గుర్తించి, ఓ ఫారమ్ లేకపోవడం నిర్ధారించి రూ.15,62,200 విలువ గల 66.5 మెట్రిక్ టన్నుల స్టాకు తదుపరి అదేశాలు ఇచ్చే వరకు అమ్మకాలు సాగించరాదని తెలిపారు. అనంతరం దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షాంసి, విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ పాల్గొన్నారు.