
బంగారం, నగదు చోరీ
తుని: పట్టణంలోని తామాకులవారి వీధిలో గల ఇంటిలో బంగారం, నగదును చోరీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడు నక్కా లోకేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోకేష్, కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పెద్దాపురం మరిడమ్మ తల్లిని దర్శించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చారు. కింది పోర్షన్‌లోకి వెళ్లి మంచినీరు తాగి తాళాలు వేశారు. అనంతరం మేడపైకి వెళ్లి అందరూ నిద్రపోయారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిద్ర లేచి కిందికి రాగా తలుపులు తెరచి, తాళాలు పగలుకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి గమనించగా, బీరువాలోని 100 గ్రాముల బంగారం, రూ.4 వేలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు తుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ విజయ్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాకినాడ నుంచి క్లూస్ టీం చోరీ జరిగిన గదిని పరిశీలించి, వేలిముద్రలను సేకరించింది.