కొబ్బరి రాజసం | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి రాజసం

Jul 15 2025 6:21 AM | Updated on Jul 15 2025 6:21 AM

కొబ్బ

కొబ్బరి రాజసం

పెరుగుతున్న ధర

ఇప్పటికే కొబ్బరి, కురిడీలకు రికార్డు స్థాయి రేటు

కురిడీ కొబ్బరి రూ.29,500

పచ్చి కొబ్బరి రూ.20 వేలు

శ్రావణ మాసంలో మరింత పెరిగే

అవకాశం

సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కొబ్బరి ఉత్పత్తుల ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. స్థానికంగా పచ్చి కొబ్బరి, కురిడీ కొబ్బరి, కొత్త కొబ్బరి వంటి ఉత్పత్తులు దొరకడమే గగనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్నడంతో మార్కెట్‌లో కొబ్బరి ఉత్పత్తులకు మరింత డిమాండ్‌ వస్తుందని రైతులు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

మారె్‌క్ట్‌లో జోష్‌

శ్రావణ మాసానికి ముందే అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో జోష్‌ వచ్చింది. తాజాగా కురుడి కొబ్బరి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. మార్కెట్‌లో సోమవారం పాత కాయలలో గండేరా రకం (పెద్ద కాయలు) వెయ్యి కాయల ధర రూ.29,500 పలికింది. దీనిలోని చిన్న కాయి ధర రూ.28 వేలు. గత శనివారం మార్కెట్‌లో గండేరా రకం ధర రూ.26,500 ఉండగా, గటగాట రకం ధర రూ.25,500 ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు రకాలకు కలిపి రూ. 2,500 నుంచి రూ.మూడు వేల వరకు పెరగడం విశేషం. ఇక కొత్త రకం కాయలలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.28,500 వరకూ ఉండగా, గటగట రకం రూ.27 వేల వరకూ ఉంది.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కురిడీ కొబ్బరి వ్యాపారం మొత్తం కోనసీమ కేంద్రంగా సాగుతుండగా, పచ్చి కొబ్బరి, కొత్త కొబ్బరి వ్యాపారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. కురిడీ కొబ్బరితో పాటు పచ్చి కాయ ధరలు సైతం రికార్డు స్థాయిలో ధర ఉంది. ప్రస్తుత మార్కెట్‌లో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.19 వేల నుంచి రూ.21 వేల వరకూ ధర ఉంది.

తగ్గిన దిగుబడి

దక్షిణాదిలో కొబ్బరి అధికంగా పండే నాలుగు రాష్ట్రాలలో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో గత ఆరేడు నెలలుగా సగటున వచ్చే దిగుబడిలో 30 శాతం మాత్రమే దిగుబడి వస్తోంది. దీనితో ఉత్తరాది రాష్ట్రాల అవసరాలన్నీ ఏపీ నుంచి వెళ్లే కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి అధికంగా పడుతున్నా, కోనసీమ జిల్లాలో మాత్రమే కురిడీ కొబ్బరి తయారీ అధికం. ఈ జిల్లాలో సైతం కొబ్బరి కాయను చెట్టు నుంచి దింపిన వెంటనే ఏదో ఒక రూపంలో జాతీయ మార్కెట్‌కు తరలిపోతోంది. దీనితో కురిడీ కొబ్బరి నిల్వలు సైతం అయిపోతున్నాయి. ఈ కారణంగానే ధర అనూహ్యంగా పెరిగింది.

నిలిచిన అమ్మకాలు

శ్రావణ మాసం మార్కెట్‌పై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దక్షణాదిన దిగుబడులు పెరగకపోవడంతో స్థానికంగా వచ్చే కొబ్బరికి మరింత డిమాండ్‌ వస్తోందని రైతులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కొబ్బరి వెయ్యికాయల ధర రూ.25 వేల వరకూ చేరుతుందని రైతులు నమ్ముతున్నారు. దీనికి తోడు రైతు సంఘాల నాయకులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామాజిక మాధ్యమాలపై ద్వారా ధర మరింత పెరుగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనితో రైతులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు. కొందరు రైతులు శ్రావణ మాసం వారం రోజులు వస్తోందనగా జరిగే మార్కెట్‌ను బట్టి అమ్మకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనితో కోనసీమ జిల్లాలో రైతుల వద్ద పచ్చికొబ్బరి కొనుగోలు దాదాపు లేదనే చెప్పావచ్చు. ఇది వ్యాపారులకు మింగుడుపడడం లేదు. శ్ఙ్రీగతంలో కొబ్బరికాయ రూ.15 ఉంటేనే రైతులు ముందుగానే దింపులు చేసి అమ్మకాలు చేసేవారు. ఇప్పుడు దిగుబడి కొబ్బరి తోటల్లో రాశులుగా ఉన్నా.. కొబ్బరికాయ ధర రూ.21 ఉన్నా కూడా తొందరపడి అమ్మకాలు చేయడం లేదు అని అమలాపురం మండలం కామనగరువుకు చెందిన ఒక వ్యాపారి సాక్షి వద్ద వాపోయాడు.

ధర పెరిగే అవకాశం

శ్రావణం మాసం వచ్చే కొద్దీ కొబ్బరికి ధర పెరుగుతోందనే అంచనా తో ఉన్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో అదే వాతావరణం ఉంది. అందుకే మా రైతులంతా జాగ్రత్తగా అమ్మకా లు చేస్తున్నాం. తమిళనాడులోనే కాదు, మనకు దిగుబడులు తగ్గుతు న్నాయి. ధర అధికంగా ఉన్నందున దిగుబడులు తగ్గాయనే ఆందోళన స్థానిక రైతులకు కనిపించడం లేదు.

– ఇళ్ల గోపి, కొబ్బరి రైతు,

గంగలకుర్రు అగ్రహారం,

అంబాజీపేట మండలం

శ్రావణ సీజన్‌

ప్రస్తుతం ఆషాడమాసం జరుగుతోంది. అయినా కూడా కొబ్బరి ఉత్పత్తుల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఈనెల 25వ తేదీ నుంచి శ్రావణం మొదలు కావడమే. ఇప్పటికే శ్రావణ మాసం కొనుగోలు మొదలైంది. దేశ వ్యాప్తంగా శ్రావణమాసం నుంచి పెద్ద ఎత్తున పూజలు మొదలు కానున్నాయి. పండుగల సీజన్‌ కూడా ఆరంభం కానుంది. వినాయక చవితి, తరువాత దసరా, దీపావళి పంటి పండుగలు ఉన్నాయి. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరాదిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మన రాష్ట్రంలో కూడా పూజలు, శుభ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. వీటికి కూడా కొబ్బరి పెద్ద ఎత్తున వినియోగిస్తారు. ఈ కారణంగా అటు ఉత్తరాది రాష్ట్రాలోనే కాకుండా స్థానికంగా కూడా కొబ్బరికాయకు డిమాండ్‌ పెరగనుంది.

కొబ్బరి రాజసం 1
1/3

కొబ్బరి రాజసం

కొబ్బరి రాజసం 2
2/3

కొబ్బరి రాజసం

కొబ్బరి రాజసం 3
3/3

కొబ్బరి రాజసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement