
వరద నీటి బెడద
నదీపాయల్లోనూ..
వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. కోనసీమ జిల్లా సరిహద్దులో ఉన్న పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాల ప్రజలు మండలంలోని వైవీ పాలెం ఏటిగట్టు నుంచి పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో పడవపై వెళ్తున్న లంక గ్రామాల ప్రజలు