
కొనసాగుతున్న నీటి ఉధృతి
అయినవిల్లి: గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ముక్తేశ్వరం వృద్ధగౌతమి (తొగరపాయ)పాయలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వృద్ధగౌతమి నదిపై పాత వంతెన ముంపునకుగురైంది. చింతనలంక, మడుపల్లిలంక, శానపల్లిలంక,వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, పొట్టిలంక గ్రామాల్లోని పల్లపు భూముల్లో పంట చేలు వరద నీట మునిగాయి. కూరగాయ, అరటి తదితర పంటలు నీట మునిగాయి. వరదనీటి ముంపు వల్ల పంటలు పూర్తి నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముక్తేశ్వరం–కోటిపల్లి రేవులో వదర ఉధృతి కొనసాగుతోంది. లంక గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న పాడి పశువులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు పడవలపై తరలిస్తున్నారు.