
కర్ణాటక ఓపెన్ చెస్ విజేత అక్షయ
జాతీయ స్థాయికి ఎంపిక
అమలాపురం రూరల్: మండలంలోని సవరప్పాలేనికి చెందిన సత్తి అక్షయ కర్ణాటక ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. కర్ణాటకలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న అక్షయ చదువుతో పాటు చెస్‌లో తన ప్రతిభను చాటి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత ద్వారా జాతీయ స్థాయికి అర్హత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. సవరప్పాలేనికి చెందిన అక్షయ తల్లిదండ్రులు వృత్తి రీత్యా కర్ణాటకలో స్థిరపడ్డారు. అక్షయ విజయంపై గ్రామంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఆమె జాతీయ స్థాయిలో విజయం సాధిచాలని అక్షయ తాతయ్య సత్తి ప్రసాద్, నానమ్మ వరలక్ష్మి, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.