
రత్నగిరిపై భక్తజనవాహిని
● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది
● 1,500 వ్రతాల నిర్వహణ
● దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని 25 వేల మంది భక్తులు దర్శించుకోగా 1,500 మంది వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 5 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహన సేవ ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేడు తొలి ఏకాదశి
తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పాలతో, 9 గంటలకు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగిస్తారు.
‘లోవ’ భక్తుల కోసం లక్ష ప్రసాదం ప్యాకెట్లు
ఆషాఢ మాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకుని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లి, తిరిగి వచ్చే భ క్తుల కోసం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యా కెట్లు సుమారు లక్ష సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. గత నెల 29న తొలి ఆదివారం 75 వేల ప్ర సాదం ప్యాకెట్లు విక్రయించగా, రూ.15 లక్షల ఆదా యం సమకూరింది. ఈసారి లోవ భక్తులు మరింత ఎ క్కువగా ప్రసాదం ప్యాకెట్లు కొనుగోలు చేస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరంలో రత్నగిరి తొలి పావంచా వద్ద, జాతీయ రహదారిపై పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.