
పనస.. ‘ఫల’ప్రదం
పనస సాగుకూ కోనసీమ పెట్టింది పేరు. మార్చి నుంచి జూలై వరకూ పనస సీజన్. ఒక్కో చెట్టుకు 50 నుంచి 100కు పైగా కాయలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా కొబ్బరిలో అంతర పంటగా సుమారు 100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. అంబాజీపేట కేంద్రంగా ఏటా రూ.కోటి విలువైన పనస కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి.
ఏ దిల్ ‘మ్యాంగో’మోర్
కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పండే బంగినపల్లి కాయకు యమ క్రేజ్ ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ పండే బంగినపల్లికి ఉమ్మడి రాష్ట్రాలతో పాటు చైన్నె, బెంగళూరులో కూడా డిమాండ్ ఉంది. గూడపల్లితో పాటు చుట్టుపక్కల సుమారు 2 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది.

పనస.. ‘ఫల’ప్రదం

పనస.. ‘ఫల’ప్రదం