రైతు బిడ్డకు 1911 ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

రైతు బిడ్డకు 1911 ర్యాంకు

Jun 3 2025 12:11 AM | Updated on Jun 3 2025 12:11 AM

రైతు బిడ్డకు 1911 ర్యాంకు

రైతు బిడ్డకు 1911 ర్యాంకు

ఆలమూరు: మండలంలోని చెముడులంకకు చెందిన రైతు బిడ్డ నాగిరెడ్డి తేజ చంద్రనారాయణ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 1911 ర్యాంకు సాధించాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివిన అతడు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందాడు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివి, అత్యున్నత ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తానని అతను తెలిపాడు. ఇదే కుటుంబంలో తేజ చంద్రనారాయణ సోదరి శ్రావణి 2022లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1800వ ర్యాంకును సాధించి, ప్రస్తుతం మద్రాసు ఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. సరస్వతీ కటాక్షం కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసు, నాగ అరుణ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement