
ద్విచక్ర వాహనదారునికి ఫైన్ షాక్
డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.10 వేల జరిమానా
కొత్తపేట: లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి రూ.10 వేలు ఫైన్ పడింది. వివరాలిలా ఉన్నాయి... కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర సోమవారం స్థానిక కమ్మిరెడ్డిపాలెం మలుపు వద్ద సిబ్బందితో కలిసి ట్రాఫిక్ బీట్ వేశారు. ఆ సందర్భంగా స్థానిక బాలయోగిపేటకి చెందిన ఒక యువకుడు మరో ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ వెళుతుండగా ఎస్సై సురేంద్ర ఆపారు. లైసెన్స్ ఏది? అని అడగ్గా లేదని చెప్పడంతో నంబరుతోపాటు మోటార్ సైకిల్‌తో సహా అతని ఫొటో తీసి నేషనల్ ఎంవీ యాక్ట్ యాప్‌లో నమోదు చేసి ఆ వాహనదారు ని పంపించేశారు. అయితే రాత్రి అతని సెల్‌ఫోన్‌కు మోటార్‌సైకిల్ డీటెయిల్స్‌తో పాటు లైసెన్స్ లేనందుకు రూ.10,035 ఫైన్ పడినట్టు మెసేజ్ వచ్చింది. ఆ ఫైన్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆ చలానాలో పేర్కొన్నారు. దీంతో ఆ వాహనదారుడు నిర్ఘాంతపోయాడు.