
సీఎం పర్యటన కోసం చెట్ల నరికివేత
కాట్రేనికోన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 31 పర్యటించనున్న నేపథ్యంలో సందర్భంగా చెయ్యేరులో రోడ్డు వెంబడి చెట్లను నరికి వేస్తున్నారు. పచ్చదనం కోసం రోడ్డుకు ఇరువైపులా మహిపాలచెరువు నుంచి పల్లంకుర్రు వరకు ప్రభుత్వం మొక్కలు నాటింది.
రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్య చేపట్టింది. అయితే సీఎం పర్యటన సందర్భంగా రోడ్డు వెంబడి పచ్చదనంగా ఉండి ప్రయాణికులకు నీడను అందిస్తున్న చెట్లు నరివేస్తుండటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెయ్యేరులో రోడ్డు వెంబడి నరికి వేసిన చెట్లు