రాష్ట్రంలో ఎన్‌డీఏ రాక్షస పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఎన్‌డీఏ రాక్షస పాలన

May 3 2025 7:48 AM | Updated on May 3 2025 7:48 AM

రాష్ట్రంలో ఎన్‌డీఏ రాక్షస పాలన

రాష్ట్రంలో ఎన్‌డీఏ రాక్షస పాలన

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై దాడి దారుణం

రాజమహేంద్రవరం సిటీ: తమ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం దారుణమని వైఎస్సార్‌ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. పెదపూడి మండలం దోమాడలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను పరామర్శించి, వారికి బియ్యం పంపిణీ చేసి తిరిగి వస్తుండగా డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిపై టీడీపీకి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారన్నారు. బాధితుల పక్షాన నిలబడి, ధైర్యం చెప్పి తిరిగి వస్తున్న క్రమంలో టీడీపీ గూండాలు ఒక పథకం ప్రకారమే ఈ దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్‌ గూడూరి అక్కడి నుంచి డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిని ఫోనులో పరామర్శించారు.

పెదపూడి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును పక్కన పెట్టి, ఎన్డీఏ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్‌ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డిపై పెదపూడిలో గురువారం రాత్రి టీడీపీ, ఎన్‌డీఏ కూటమి మూకలు దాడికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వైఎస్సార్‌ సీపీ కీలక నేతలు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ అనపర్తి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమాలు, అవినీతిని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఎండగడుతున్నారని, దీనిని తట్టుకోలేక దాడికి ప్రయత్నంచడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలే లక్ష్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. దీనిపై ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, శాంతికి మారుపేరుగా, మంచితనానికి మచ్చుతునకగా, నలుగురికీ చేతనైన సాయం చేస్తూ సౌమ్యంగా, గాంధీలా ఉండే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిని అల్లూరిగా మార్చి తప్పు చేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టాక నియోజకవర్గంలో జరుగుతున్న ఒక్కో సంఘటనతో డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి రోజురోజుకూ రాటుదేలుతున్నారని అన్నారు. ఇక ఆయనను తట్టుకోవడం ఎమ్మెల్యే నల్లమిల్లి వల్ల కాదని అన్నారు. డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిపై జరిగిన దాడి ఘటనను వదిలిపెట్టేదే లేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర స్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో రౌడీయిజం ఎల్లకాలం చెల్లదన్నారు. వైఎస్సార్‌ సీపీ రౌడీయిజం చేయాలనుకుంటే నియోజకవర్గ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తిరగనియ్యరని రాజా హెచ్చరించారు. మాజీ హోం మంత్రి, పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి తీవ్ర దౌర్జన్యకాండకు పాల్పడుతోందని, దీనికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు కూడా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.

కార్యకర్తలు అండగా ఉండగా ఏమీ చేయలేవు

వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండగా తనను ఎమ్మెల్యే నల్లమిల్లి ఏమీ చేయలేర ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయనరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పార్టీ సోషల్‌ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులపై అనేక దాడులు చేశారని చెప్పారు. దీని ద్వారా ఎమ్మెల్యే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో నేరుగా తనను అంతమొందించేందుకు పెదపూడి గ్రామంలో దాడి చేయించారని ఆరోపించారు. కార్యకర్తలను, నాయకులను బెదిరిస్తే బెదిరిపోయే పని కాదని భావించి, ఏకంగా తనను అంతమొందించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రయత్నించారని అన్నారు. తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, ఏమాత్రం వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి క్షణం ఎమ్మెల్యే అక్రమాలు, తప్పులను ఎండగడుతూనే ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన ప్రతి వైఎస్సార్‌ సీపీ కుటుంబ సభ్యుడూ రెట్టింపు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలోనే ఉందని, వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎవరినైనా ఇబ్బంది పెడితే, వారు ధైర్యంగా ముందుకు వస్తే అన్ని విధాలా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు లంక చంద్రన్న, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ సత్తి రామకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ ఆర్టనైజింగ్‌ కార్యదర్శి తాడి సూరారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్‌ పోతుల ప్రసాద్‌రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు కొండేటి భీమేష్‌, జిలా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లభశెట్టి సతీష్‌, నియోజకవర్గ వీవర్స్‌ విభాగం అధ్యక్షుడు పప్పు సింహాచలం, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సాంబత్తుల చంటి, పార్టీ మండల కన్వీనర్‌ గుత్తుల రమణ, ఎంపీటీసీ సభ్యుడు సమ్మంగి దుర్గాప్రసాద్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు, అనపర్తి గ్రామ పార్టీ కన్వీనర్‌ మురళీబాలకృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు సత్తి హరిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడితే బుద్ధి చెబుతాం

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డికి

పార్టీ నేతల సంఘీభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement