
కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు
బ్రిటిష్ పాలకులు కూడా ప్రజానీకాన్ని
అంతలా వేధించలేదేమో. ప్రస్తుతం కూటమి సర్కారు ప్రజలను పీడిస్తున్న విధానాలు చూస్తుంటే.. ఔనా అనిపిస్తుంది. వందేళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వానికి వాయిదాలు చెల్లించి, పక్కా దస్తావేజులతో కొందరు స్థలాలు
సొంతం చేసుకున్నారు. కొన్ని తరాల నుంచి ఉంటున్న ఆ ఇళ్ల యజమానులపై ఇప్పుడు కూటమి సర్కారు గ్రౌండ్ రెంట్ స్థలాల పిడుగు వేసింది. దీనిపై అమలాపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఇటువంటి స్థలాల్లో ఉంటున్న వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురం టౌన్: గ్రౌండ్ రెంట్ స్థలం అనే విధానం బ్రిటిష్ ప్రభుత్వంలో 1927లో అమలైంది. ప్రభుత్వ స్థలాలను పదేళ్ల పాటు వాయిదాల రూపంలో అద్దెకు ఇవ్వడం వల్ల ఈ స్థలాలకు గ్రౌండ్ రెంట్ అనే పేరు వచ్చింది. ఏడాదికి రూ.3కు మించిన విలువతో పదేళ్ల పాటు వాయిదాల రూపంలో నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత ఆ స్థలానికి గ్రౌండ్ రెంట్ తీరిపోయేది. అప్పటి నుంచి నేటి వరకూ తరాలు మారినా ఆ స్థలాల్లో పక్కా దస్తావేజులతో పలువురు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. తాజా కూటమి ప్రభుత్వం అవే స్థలాలను నిషేధిత భూముల జాబితాలోకి చేర్చింది. ఈ ఏడాది జనవరి 29న జారీ చేసిన జీఓ నం.30 ద్వారా 22(ఎ) ప్రకారం గవర్నమెంట్ పోరంబోకు (జీపీ) స్థలాలుగా పేర్కొంటోంది. వీటిల్లో ఉంటున్న వారిపై రెగ్యులరైజేషన్ ఆంక్షలు విధిస్తూ, గ్రౌండ్ రెంట్ స్థలాల రగడకు తెర తీసింది. దీంతో ఆయా స్థలాల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.
నిషేధిత జాబితాలో 750 ఇళ్లు
ఆయా స్థలాలకు సంబంధించిన నాటి ఒప్పంద పత్రాలు అమలాపురంలో కొందరి వద్ద నేటికీ పదిలంగా ఉన్నాయి. నాడు వాయిదాలు పూర్తిగా చెల్లించి, స్థలాన్ని సొంతం చేసుకున్న దాఖలాలున్నాయి. ఆ తర్వాత ఈ స్థలాలకు పక్కా దస్తావేజులు లభించిన ఆధార పత్రాలు కూడా వారి వద్ద ఉన్నాయి. అయినప్పటికీ, వీటిని పోరంబోకు స్థలాలను గుర్తించేందుకు అమలాపురం మున్సిపాలిటీలోని 15 వార్డుల సచివాలయాల సర్వేయర్లు ప్రస్తుతం ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. జీఓ నం.30కి అనుగుణంగా పట్టణంలోని సూర్యనగర్, మద్దాలవారిపేట, సీతాపతిరావుపేట తదితర ప్రాంతాల్లో దాదాపు 600 ఇళ్లు నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అలాగే, ముమ్మిడివరం నగర పంచాయతీలో దాదాపు 150 ఇళ్లున్నాయని సమాచారం.
మూడు సెంట్లు దాటితే..
అమలాపురం, ముమ్మిడివరం పట్టణాల్లో ఇప్పటికే గుర్తించిన 750 ఇళ్లకు సంబంధించి మూడు సెంట్ల (సుమారు 150 గజాల్లో) స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారిగా పరిగణిస్తున్నారు. వీరికి రెగ్యులరైజేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మూడు సెంట్లకు పైబడిన స్థలంలో ఇళ్లున్న వారిని దారిద్య్ర రేఖకు ఎగువన గుర్తించారు. వీరు తమ స్థలాలను కచ్చితంగా రెగ్యులరైజేషన్ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అమలాపురంలో సుమారు 110 ఇళ్లు మూడు సెంట్లు పైబడిన విస్తీర్ణంలో ఉన్నాయి. వీరంతా తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు వారు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. పక్కా దస్తావేజులున్న తమ వద్ద రెగ్యులరైజేషన్ పేరుతో ప్రభుత్వం రూ.లక్షలు గుంజుతూండటంపై వారు మండిపడుతున్నారు. ఉదాహరణకు.. అమలాపురం పట్టణంలో ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజం స్థలం రూ.18 వేల వరకుంది. దానిపై 15 నుంచి 100 శాతం వరకూ సెంట్ల ఆధారంగా బేసిక్ వాల్యూ కూడా వర్తింపజేసి బాధితులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రశాంతంగా
పాలిసెట్–2025
రాయవరం: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి బుధవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అమలాపురంలో మూడు, ముక్తేశ్వరంలో రెండు, రామచంద్రపురంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జిల్లావ్యాప్తంగా తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో 4.377 మంది విద్యార్థులు పాలిసెట్ రాయాల్సి ఉండగా, 4,026 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.98 శాతం హాజరు నమోదైంది.
అమలాపురంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 1,260 మంది బాలురు, 904 మంది బాలికలు, ముక్తేశ్వరంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో 199 మంది బాలురు, 166 మంది బాలికలు, రామచంద్రపురంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 835 మంది బాలురు, 662 మంది బాలికలు పరీక్ష రాశారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాలిసెట్–2025 జిల్లా కో–ఆర్డినేటర్ కేపీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీసు, విద్యా, ప్రజా రవాణా శాఖ అధికారుల సహకారంతో పరీక్ష విజయవంతంగా జరిగిందన్నారు.
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరానికి ప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి గల అనుబంధం మరింత ఽబలపడేలా స్థానిక యువ పండితుడు, చతుర్వేది, ఏకసంథాగ్రాహి, దుడ్డు సత్యవేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ తమిళనాడులోని కాంచీపురంలో గల కంచి కామకోటి ఉత్తరాధికారిగా, తదుపరి 71వ పీఠాధిపతిగా అక్షయ తృతీయ పర్వదినాన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సత్యదేవుని నామం కలిపి ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ఇకపై భక్తుల ఆశయాలకు ప్రతీకగా నిలుస్తారని కంచి కామకోటి పీఠాథిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అభిభాషించారు.
శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష
కంచిలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలోని పంచగంగా తీర్థంలో ఉదయం 5–30 నుంచి ఎనిమిది గంటల వరకు జరిగిన వైదిక కార్యక్రమంలో పండితుల మంత్రోచ్ఛాటన మధ్య దుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్ యజ్ఞోపవీతాన్ని విసర్జించారు. తల్లిదండ్రులు దుడ్డు ధన్వంతరి, మంగాదేవి సమక్షంలో వేలాది మంది భక్తులు, పీఠం అభిమానులు చూస్తుండగా సన్యాసి దీక్ష స్వీకరిస్తున్నట్లు బిగ్గరగా మూడుసార్లు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రకటించారు.
శంకరునికి శూలంలా...
విష్ణువుకు చక్రంలా యతికి దండం
శరీరంపై ఉన్న తెల్లని వస్త్రాలను కూడా నీటిలోనే వదిలి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఇచ్చిన కాషాయ వస్త్రాలను ధరించారు. అనంతరం శంకరునికి శూలంలా, విష్ణువుకు చక్రంలా యతి కి దండం ఎల్లప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుందని స్వామీజీ ఉపదేశించి దండాన్ని అందించారు. దండాన్ని చేతబూని ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి’గా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పెద్ద స్వామీజీతో కలిసి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తరువాత కంచి పీఠంలో శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల బృందావనాలను దర్శించారు. తరువాత కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి పీఠంలో శ్రీచంద్రమౌళీశ్వర స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు.
అన్నవరంలో ప్రత్యేక పూజలు
శ్రీదుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్ సన్యాస దీక్ష స్వీకరించిన సందర్భంగా స్థానిక శ్రీసత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్యులుకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. సత్రం అధ్యక్షుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, సభ్యులు పాల్గొన్నారు.
కూటమి సర్కారు గ్రౌండ్ రెంట్ చిచ్చు
వందేళ్ల నాడు వాయిదాలుగా
సొంతం చేసుకున్న లబ్ధిదారులు
డబ్బు చెల్లించి, రెగ్యులరైజ్
చేసుకోవాలని జీఓ నం.30తో మెలిక
నివాస గృహాలు, పక్కా దస్తావేజులతో
ఉన్న నివాసితులు
ఇళ్లను నిషేధిత భూముల
జాబితాలో చేర్చడంపై గగ్గోలు
రెగ్యులరైజేషన్ కోసమే..
నిషేధిత జాబితాలో ఉన్న భూముల గుర్తింపునకు సర్వే జరుగుతోంది. ఈ జాబితాలో ఉండి, మూడు సెంట్లు దాటి ఉన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు కచ్చితంగా రెగ్యులరైజేషన్ చేయించుకోవాల్సిందే. ప్రస్తుతం అబ్జెక్షనబుల్, అన్ అబ్జెక్షనబుల్ అనే రెండు కోణాల్లో ఈ స్థలాలపై సర్వే చేస్తున్నాం. అబ్జెక్షనబుల్ స్థలాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రెగ్యులరైజేషన్ లేదా కొనుగోలు విధానం ద్వారా తిరిగి ఆ స్థలాన్ని పొందే వెసులుబాటు ఉండవచ్చు.
– పి.అశోక్ ప్రసాద్, తహసీల్దార్, అమలాపురం
శ్రీసత్య చంద్రశేఖరేంద్ర
సరస్వతి స్వామిగా నామకరణం
పులకించిన అన్నవరం
91.98 శాతం హాజరు

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు

కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు