
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా..
జిల్లా గోదాంకు ఇప్పటి వరకు 70శాతం పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్ చేరుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 47 టైటిల్స్ పుస్తకాలు సరఫరా చేస్తున్నాం. జిల్లా గోదాంకు వచ్చిన పాఠ్య పుస్తకాలను ఎప్పటికప్పుడు మండల కేంద్రాలకు ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా తరలిస్తున్నాం.
– పి.సురేష్, పాఠ్య పుస్తకాల మేనేజరు, బొమ్మూరు
గోదాముకు చేరాయి
ఈ ఏడాది ఏప్రిల్‌లో ముద్రించిన పాఠ్య పుస్తకాలు బొమ్మూరులోని గోదాముకు చేరుకున్నాయి. జిల్లా గోదాం నుంచి ఆయా జిల్లాల పరిధిలో మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాం. జిల్లా గోదాంకు చేరుకున్న పాఠ్య పుస్తకాలను మే మొదటి వారంలో పూర్తి స్థాయిలో మండల కేంద్రాలకు తరలిస్తాం.
– జి.నాగమణి, ఆర్‌జేడీ,
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
రాయవరం: ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసే విధానానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగిస్తోంది. పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాల సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. జిల్లా పుస్తక గోడౌన్‌కు చేరుకున్న పాఠ్య పుస్తకాలను ఆయా మండల స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు.
47 టైటిల్స్
ఈ ఏడాది రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠ్య పుస్తకాలను మరింతగా కుదించింది. గతంలో 173 వరకు టైటిల్స్ ఉండగా, ఇప్పుడు 47 టైటిల్స్ మాత్రమే ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలకు గతంలో తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రెండు సెమిస్టర్లుగా మూడు పుస్తకాలుగా ముద్రించారు. 3, 4, 5 తరగతులకు తెలుగు, ఇంగ్లిషు ఒక పుస్తకం, గణితం పరిసరాల విజ్ఞానం ఒక పుస్తకంగా సెమిస్టర్–1, సెమిస్టర్–2గా ముద్రించారు. ఇదే మాదిరిగా వర్క్‌బుక్‌లు ముద్రించారు. 6–9 తరగతుల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు సబ్జెక్టులను సెమిస్టర్–1, సెమిస్టర్–2గా ముద్రించారు. నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు విడివిడిగా సెమిస్టర్–1, 2గా ముద్రించారు. 10వ తరగతికి మాత్రం సబ్జెక్టుల వారీగా పుస్తకాలను ముద్రించారు. గణితం మాత్రం సెమిస్టర్–1, 2గా ముద్రించారు. పాఠ్య పుస్తకాలన్నీ బైలింగ్విల్ విధానంలోనే ముద్రించారు. ఒక పేజీలో ఇంగ్లిషు, ఒక పేజీలో తెలుగు పాఠ్యాంశాన్ని ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు ఈజీగా ఏ మీడియంలోనైనా చదువుకునే వీలుంది. గతం నుంచే పాఠ్య పుస్తకంలో క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ సహాయంతో పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా పొందేందుకు వీలవుతోంది. విద్యార్థులకు వెన్నెముకపై భారం పడకుండా గత ప్రభుత్వం పాఠ్య పుస్తకంలో సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
70 శాతం సరఫరా
ఇప్పటి వరకు జిల్లా గొడౌన్‌కు 70 శాతం పుస్తకాలు సరఫరా అయ్యాయి. జిల్లా గోదాంకు చేరుకున్న పుస్తకాల్లో 5,46,935 (32 శాతం) పుస్తకాలను మూడు జిల్లాల పరిధిలో 25 మండలాలకు సరఫరా చేశారు. ఇప్పటి వరకూ 13 టైటిల్స్‌కు సంబంధించి ఒక్క పుస్తకం కూడా సరఫరా కాలేదు. 3, 4, 5 తరగతులకు సంబంధించి ఒక్కొక్క టైటిల్ రావాల్సి ఉండగా, 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి రెండేసి టైటిల్స్ సరఫరా కావాల్సి ఉంది. 10 టైటిల్స్ పాఠ్య పుస్తకాలు, మూడు టైటిల్స్ వర్క్‌బుక్స్ సరఫరా కావాల్సి ఉంది.
సెమిస్టర్–1 రికై ్వర్‌మెంట్, సరఫరా అయిన పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్
జిల్లా ఇండెంట్ సరఫరా శాతం
తూర్పుగోదావరి 3,04,850 1,82,841 60
కాకినాడ 6,65,317 2,37,738 36
కోనసీమ 4,78,208 1,17,418 25
ఉమ్మడి జిల్లాకు 16,48,640
సెమిస్టర్–1 పుస్తకాలు అవసరం
ఇప్పటికే 5,46,935 పుస్తకాల రాక

పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..

పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..