Viral Video: మెడికల్ షాపులో మందులు కొనడానికి వెళ్లి గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు

Man Dies Of Heart Attack Buying Medicines Haryana Faridabad - Sakshi

చండీగఢ్‌: హరియాణా ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మెడికల్ షాపులో మందులు కొనడానికి వెళ్లిన 23 ఏళ్ల యువకుడు అకస్మాతుగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతను అడిగిన ఓఆర్‌ఎస్ ఇస్తుండగా.. క్షణాల్లోనే కిందపడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ యువకుడ్ని ఇటావాకు చెందిన 23 ఏళ్ల సంజయ్‌గా గుర్తించారు. ఛాతీలో అసౌకర్యంగా అన్పించడంతో మందుల దుకాణానికి వెళ్లిన అతడు ఓఆర్‌ఎస్ ఇవ్వమని అడిగాడు. అప్పటికే తీవ్రంగా ఇబ్బందిపడుతూ ఛాతీపై రుద్దుకోవడం వీడియోలో కన్పించింది.

మెడికల్ షాపులోని వ్యక్తి ఇతరులకు మందులు ఇచ్చి.. రెండు మూడు నిమిషాల తర్వాత సంజయ్ అడిగిన ఓఆర్ఎస్ ఇచ్చాడు. అది తీసుకోవడానికే ముందే అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. షాపులోని వ్యక్తి చేతి పట్టుకుని కిందపడకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బయటకు వెళి చూస్తే సంజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

చదవండి: ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top