
మంచిర్యాల: కాసిపేట మండలం మలకపల్లిలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని ఆత్మహ్యతకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.మృతుల్లో జంజిరాల రమేష్ (40), పద్మ (35), కుమారుడు అక్షయ్ కుమార్ (17), కుమార్తె సౌమ్య(19) ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను మార్చురికి తరలించారు.