ఆస్తి ఇవ్వలేదని.. అక్కను చంపిన తమ్ముడు | Brother Assassinated His Sister For Property Issue | Sakshi
Sakshi News home page

రోకలితో కొట్టి చంపేసిన వైనం  

Apr 10 2021 11:15 AM | Updated on Apr 10 2021 12:21 PM

Brother Assassinated His Sister For Property Issue - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రం ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం జరిగిన హత్యతో నగరంలో కలకలం రేగింది. బలగ కుమ్మరి వీధిలో అమ్మాయమ్మ(65) అనే మహిళను ఆమె తమ్ముడే శుక్రవారం కిరాతకంగా హత్య చేశాడు. ఆస్తి తనకు ఇవ్వలేదనే కక్షతో రోకలితో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామానికి చెందిన న క్క అమ్మాయమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కొ డుకులు. పెద్ద కుమార్తెను తన తమ్ముడు చిట్టి ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రసాద్‌ తన కుటుంబంతో శ్రీకాకుళం బలగలోని కుమ్మరివీధిలో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగినప్పుడే కొంత భూమిని చిట్టిప్రసాద్‌కు అమ్మాయమ్మ ఇచ్చారు. ఆస్తి పంపకాల విషయమై అక్కాతమ్ముళ్ల మధ్య ఎప్ప టి నుంచో గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా అమ్మాయమ్మకు అనారోగ్యంగా ఉండడంతో శ్రీకాకుళంలో చికిత్స చేయించుకుందామని పెద్ద కూతురి ఇంటికి వచ్చారు.

శుక్రవారం చిట్టి ప్రసాద్‌ భార్య, కొడుకు పని మీద వేరే ఊరికి వెళ్లారు. దీంతో ఇంట్లో ఉన్న అమ్మాయమ్మతో చిట్టి ప్రసాద్‌ ఆస్తి విషయమై మాట్లాడారు. ఆరు సెంట్ల భూమిని చిన్న కుమార్తెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అమ్మాయమ్మ చెప్పగా.. దానికి ప్రసాద్‌ ఒప్పుకోలేదు. ఆ భూమిని తన కే ఇవ్వాలని పట్టుబట్టారు. దానికి అమ్మాయమ్మ ని రాకరించడంతో రోకలితో కసి తీరా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను చుట్టుపక్కల వారు రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవుట్‌ పో స్టు పోలీసులు కేసు నమోదు చేసి రెండో పట్టణ పోలీసులకు బదిలీ చేశారు. సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు.   

చదవండి: ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు!
యువ బాడీబిల్డర్‌ దారుణ హత్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement