
రిలయన్స్ సబ్సిడరీ జియో బీపీ సంస్థ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోతో జట్టు కట్టింది. 2030 నాటికి డెలివరీ సర్వీసుల్లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జోమాటో ఈవీ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలను దేశవ్యాప్తంగా జియో బీపీ సమకూరుస్తుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుదలకు జియో బీపీ ఇతోధికంగా కృషి చేస్తోందని రిలయన్స్ పేర్కొంది.