Vedanta Chairman Anil Agarwal Comments On Gully Boy Movie - Sakshi
Sakshi News home page

30 వేల కోట్ల రూపాయల అధిపతికి నచ్చిన ‘గల్లీ’ సినిమా

Jun 16 2022 12:19 PM | Updated on Jun 16 2022 1:15 PM

Vedanta Chairman Anil Agarwal Comments On Gully Boy Movie - Sakshi

వేదాంత గ్రూప్‌ ఫౌండర్‌ కమ్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారాడు. యువతలో స్ఫూర్తి నింపేందుకు తన జీవిత అనుభవాలను పంచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంగ్లీష్‌ ఒక్క ముక్క రాకుండా ముంబైలో తాను అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు ముప్పై వేల కోట్ల రూపాయల అధిపతిగా మారే వరకు జరిగిన ప్రస్థానాన్ని వివరిస్తున్నారు. తాను కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడంలో ఎదురైన సవాళ్లను, వాటిని తాను అధిగమించిన తీరును పూసగుచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో తన మససుకు నచ్చిన ఓ సినిమా గురించి ఆయన చెప్పారు.

జోయా అక్తర్‌ దర్శకత్వంలో 2019లో రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా వచ్చిన గల్లీబాయ్‌ సినిమా క్లిప్‌ను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందులో గల్లీబాయ్‌ ర్యాపర్‌గా ఎదిగే క్రమాన్ని చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు. ధైర్యం ఉన్న వాళ్లే కలలు కంటారని వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని ఆఖరికి సొంత తండ్రి కూడా నమ్మని సమయంలోనూ మురాద్‌ (రణ్‌వీర్‌సింగ్‌) ధైర్యం కోల్పోకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడని వివరించారు. గల్లీబాయ్‌ నిజంగా స్ఫూర్తిని నింపే సినిమా అంటూ అనిల్‌ అగర్వాల్‌ ప్రశంసించారు. 

చదవండి: ఆనంద్‌ మహీంద్రాకు ఆర్బీఐ బంపరాఫర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement