టయోటా నుంచి సీఎన్‌జీ వేరియంట్లు, బుకింగ్స్‌ షురూ 

Toyota Glanza Now Get CNG Variants Bookings Open - Sakshi

హైదరాబాద్: వాహన తయా రీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తాజా గా సీఎన్‌జీ విభాగంలోకి ప్రవేశించింది. గ్లాంజా, అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ మోడళ్లలో సీఎన్‌ జీ వేరియంట్లను పరిచయం చేసింది. గ్లాంజా ధర రూ.8.43 లక్షల నుంచి ప్రారంభం. అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ ధరను ప్రకటించాల్సి ఉంది.   

బ్రాండ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా  ఆన్‌లైన్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.  రూ. 11 వేలు  చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. గ్లాంజా ఎస్‌ ట్రిమ్‌కు రూ. 8.43 లక్షలు, జీ ట్రిమ్‌కి రూ. 9.46 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది.పెట్రోల్  వెర్షన్‌తో పోలిస్తే, గ్లాంజా సీఎన్‌జీ ధర రూ. 95,000 ఎక్కువ.

ఇంజీన్‌, ఫీచర్లు
55 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చింది. ఇంటీరియర్ ఎలాంటి మార్పులు లేవు.  LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఇందులో  ఉన్నాయి.  ఇటీవల లాంచ్‌ చేసిన బాలెనో  సీఎన్‌జీతో ఇది  పోటీ పడనుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top