ఎస్‌బీఐ ట్వీట్‌ : నెటిజనుల సెటైర్లు

SBI Jio have more customers than US population - Sakshi

అమెరికా జనభాకంటే  మా ఖాతాదారులే అధికం : ఎస్‌బీఐ

వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న నెటిజన్లు

అమెరికా జనాభా 33.2కోట్లు

మా వినియోగదారులు 40కోట్లు : జియో

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 2019-20 వార్షిక నివేదిక ప్రకారం తన ఖాతాదారుల సంఖ్య అమెరికా  జనాభాకంటే ఎక్కువ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అమెరికా జనాభా 33.2 కోట్లు.. దేశవ్యాప్తంగా 22,141 శాఖలలో 44.89 కోట్ల కస్టమర్లు తమ సొంతమని  ట్వీట్‌ చేసింది. తమ  కస్టమర్ల సంఖ్య మొత్తం అమెరికా జనాభా కంటే ఎక్కువగా ఉందంటూ ఉత్సాహంగా, గర్వంగా ప్రకటించింది.  దీంతో నెటిజన్లు ఎస్‌బీఐ పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఎస్‌బీఐ సేవలకు సంబంధించి తమకెదురైన చేదు అనుభవాలు, అనుభవించిన ఫ్రస్ట్రేషన్‌ను ప్రకటించేందుకు  యూజర్లు ఈ అవకాశాన్ని భలే ఉపయోగించుకున్నారు. కస్టమర్లకు పేలవమైన సేవను అందించడానికి  కారణం అదేనా? ఎస్‌బీఐ సిబ్బంది మొరటు ప్రవర్తన, అసమర్థత.. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో.. అంటూ ఒక యూజర్‌ ఘాటుగానే స్పందించారు. దయచేసి ఎన్‌పీఏఎ గురించి కూడా మాట్లాడమని కొందరు, ఖచ్చితంగా మంచి జోకు పేల్చారు అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం.

అటు  అమెరికా జనాభాను మించిన  యూజర్లు అంటూ  టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్‌ జియో కూడా ఇలాంటి సమాచారాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. జియో కస్టమర్ల సంఖ్య 2020 నాటికి 40 కోట్లతో మొత్తం అమెరికన్ జనాభాను అధిగమించిందని ట్వీట్‌ చేసింది. ఈ  క్రమంలో ఎస్‌బీఐ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top