చిన్న కార్లపై భారీ డిస్కౌంట్లు.. మార్చి మారే లోపే ఛాన్స్‌ | Renault Discount March 2026 Up To Rs 80000 Off On Triber, Kiger, Kwid cars | Sakshi
Sakshi News home page

చిన్న కార్లపై భారీ డిస్కౌంట్లు.. మార్చి మారే లోపే ఛాన్స్‌

Mar 26 2026 1:20 PM | Updated on Mar 26 2026 1:40 PM

Renault Discount March 2026 Up To Rs 80000 Off On Triber, Kiger, Kwid cars

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగింపు దశకు చేరుకోవడంతో, అమ్మకాల్లో జోరు పెంచేందుకు రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ మోడళ్లపై మార్చి 2026 నెలకు గానూ ఆకర్షణీయమైన కన్స్యూమర్ ఆఫర్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో ఈ ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 80,000 వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది.

రెనాల్ట్ కీగర్ 
సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కీగర్ (Renault Kiger), ఈ నెలలో భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. స్టైలిష్ లుక్, టర్బో ఇంజన్ ఆప్షన్లతో లభించే ఈ కారుపై మార్చిలో రూ. 80,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 10.34 లక్షల మధ్య ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లు కోరుకునే వారికి ఈ తగ్గింపులు మంచి డీల్ అని చెప్పవచ్చు.

రెనాల్ట్ ట్రైబర్ 
మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ ఎమ్‌పీవీ ట్రైబర్ (Renault Triber) కూడా ఈ నెలలో అత్యంత సరసమైన ధరకే లభించనుంది. ఫ్లెక్సిబుల్ సీటింగ్ అమరికతో వచ్చే ఈ కారుపై కూడా గరిష్టంగా రూ. 80,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 8.60 లక్షల వరకు ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీ కోరుకునే కుటుంబాలకు ఇది ఉత్తమ ఎంపిక.

రెనాల్ట్ క్విడ్ 
మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఆల్-టైమ్ ఫేవరెట్ అయిన క్విడ్ (Renault Kwid) హాచ్‌బ్యాక్‌పై రెనాల్ట్ రూ. 70,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ కారు 1.0-లీటర్ ఇంజన్, ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల మధ్య ఉంది. సిటీ డ్రైవింగ్‌కు అనువైన ఈ కారుపై లభిస్తున్న రూ. 70 వేల తగ్గింపు దీని విలువను మరింత పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement