రియల్‌మీ బడ్జెట్‌ ఫోన్లు 

Realme Entry Level Smartphone Budget Phones C Series In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్‌ ఫోన్స్‌ బ్రాండ్‌ రియల్‌మీ తాజాగా సి–సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను రూపొందించింది. వీటి ధరలు రూ.6,799 నుంచి రూ.10,999 వరకు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ర్యామ్‌ 2–4 జీబీ, ఇంటర్నల్‌ మెమరీ 32–128 జీబీ, బ్యాటరీ 5000–6000 ఎంఏహెచ్‌ ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సి–సిరీస్‌లో 3.2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయని రియల్‌మీ వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌ సేథ్‌ తెలిపారు.  

10 కోట్లు దాటిన భారత్‌పే యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్‌ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021–22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్‌టెక్‌ పరిశ్రమలో భారత్‌పే 8.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్‌పే యూపీఐ పర్సన్‌ టు మర్చంట్‌ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్‌పే గ్రూప్‌ అధ్యక్షుడు సుహైల్‌ సమీర్‌ తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. క

రోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్‌పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్‌ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్‌పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్‌ డాలర్ల టీపీవీ (టోటల్‌ పేమెంట్స్‌ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top