ఆటో డెబిట్ కొత్త రూల్స్‌.. ఐదువేలకు మించితే ఓటీపీ మస్ట్‌, అదనపు ఛార్జ్‌??

RBI New Directions In Auto Debit EMI Payments From October 1 - Sakshi

Auto-Debit For EMI Payments: హోం లోన్స్‌ ఇతరత్ర నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్‌ పేమెంట్‌ మోడ్‌ను ఆశ్రయిస్తున్నారా? బ్యాంక్‌ ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌, మొబైల్‌ వాలెట్స్‌ వాడుతున్నారా? అయితే అక్టోబర్‌ 1 నుంచి అమలు కాబోతున్న కొత్త నిబంధనలను తెలుసుకోండి. ఈ తేదీ నుంచి బ్యాంకులుగానీ, ఇతరత్ర ఫైనాన్షియల్‌ సంస్థలుగానీ ఆటోమేటిక్‌ పేమెంట్స్‌ కోసం కస్టమర్ల నుంచి ‘అదనపు ధృవీకరణ’ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేకుంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.  

ఎలాంటి వాటిపై ప్రభావం అంటే.. 
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌ స్స్ర్కిప్షన్‌, మొబైల్‌ బిల్‌ పేమెంట్స్‌, ఇన్సురెన్స్‌ ప్రీమియమ్‌, యుటిలిటీ బిల్స్‌ ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు చెల్లింపుల మీద, అలాగే ‘వన్స్‌ ఓన్లీ’ పేమెంట్స్‌కు సైతం కొత్త నిబంధనలు వర్తించవు. గడువు తర్వాత తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ.

ఎక్స్‌ట్రా ఛార్జీలు??
హోం లోన్స్‌ ఈఎంఐగానీ, ఇతరత్ర పేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిట్‌ మోడ్‌లో కట్‌ అయ్యేవిధంగా కొందరు సెట్‌ చేసుకుంటారు కదా. అయితే వీళ్లు ఇకపై మ్యానువల్‌గా అప్రూవ్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుండగా.. యూజర్ల నెత్తిన పిడుగు తప్పదనే మరోప్రచారం మొదలైంది. ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే కథనాలు కొన్ని జాతీయ మీడియా వెబ్‌సైట్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

 

ఆర్బీఐతో చర్చలకు.. 
మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నిబంధన అమలుపై మల్లగుల్లాలు చేస్తున్నాయి. నిజానికి యూజర్ల భద్రత అంశం, ఆన్‌లైన్‌ మోసాల కట్టడి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ నిబంధనను రెండేళ్ల క్రితమే ప్రతిపాదించింది. ఏప్రిల్‌ 1, 2021 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంది. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు కొంత గడువు కోరడంతో.. ఇప్పుడు అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నిబంధన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఖాతాదారులు, యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని ప్రకటిస్తూనే.. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులు ఆర్బీఐతో చర్చలకు సిద్ధం కావడం కొసమెరుపు.

చదవండి: నిలువునా ముంచేసిన బ్యాంకు.. ఊరట అందించిన ఆర్బీఐ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top