ఆర్‌బీఐ షాక్‌.. త్వరలో వడ్డీరేట్లను పెంచనుందా?

Rbi Likely To Hike Benchmark Interest Rate By 25 Bps  - Sakshi

పెరిగిపోతున్న రీటైల్‌ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 3,5,6 తేదీలలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు 25 బేసిస్‌ పాయింట్లు పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని విడుదల చేయడానికి ముందు వివిధ జాతీయ,అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఏప్రిల్ 3, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు సమావేశం కానుంది. 

కాగా, ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో మే నుండి ఇప్పటికే రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top