రూ.7,499లకే సరికొత్త స్మార్ట్‌ఫోన్..

Poco C65 Launched In India Price Specifications More details - Sakshi

లేటెస్ట్‌ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్‌. చౌక ధరలో స్మార్ట్‌ఫోన్లు అందించే చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్‌లో సరికొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్లు డిసెంబర్‌ 18 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. 

పోకో సీ65 స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. వీటి సేల్‌ డిసెంబర్‌ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్‌ను రూ.7,499 లకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు ​కూడా రూ. 10,000 లోపే లభిస్తాయి. పోకో సీ65 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 8,499, 6జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 9,499, 8+256GB 8జీబీ/256జీబీ వేరియంట్‌కు రూ. 10,999 ధరను కంపెనీ నిర్ణయించింది. అయితే స్పెషల్‌ సేల్‌ డే రోజున ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపు, ఎక్సేంజ్‌ ఆఫర్‌ ద్వారా వీటిని వరుసగా రూ.7,499, రూ. 8,499, రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్లు పాస్టెల్ బ్లూ, మాట్టే బ్లాక్‌ అనే రెండు రంగుల్లో లభ్యమవుతాయి.ప్రత్యేక మైక్రో ఎస​్‌డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

పోకో సీ65 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 6.74 అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లే
  • MediaTek Helio G85 ప్రాసెసర్‌
  • సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్
  • 10 వాట్‌ C-టైప్‌ ఛార్జర్ సపోర్ట్‌
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top