
5 లక్షల కోట్ల డాలర్లు..దీనితో సాకారం కాగలదు..ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష ..!
న్యూఢిల్లీ: 2024–25 నాటికి దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాకారానికి.. ప్రధాన మంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఎంపీ) కీలకంగా ఉంటుందని కేంద్ర రహదారి, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సంబంధిత వర్గాల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను మనం మరింత పటిష్టం చేసుకోవాలి.
కనెక్టివిటీని పెంచే దిశగా తలపెట్టిన ఎన్‌ఎంపీ ఇందుకు తోడ్పడగలదు. దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష .. దీనితో సాకారం కాగలదు‘ అని గడ్కరీ చెప్పారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ వ్యయాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..!