ఆధార్‌ కార్డ్‌ మీద ఫోటో నచ్చలేదా.. ఇలా మార్చుకోండి

Photo on Aadhaar Card Change It in Minutes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మన గుర్తింపునకు ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి అయ్యింది. కానీ ఆధార్‌ కార్డులో ఉండే ఫోటోలు చూస్తే.. మనమా కాదా అని డౌట్‌ వస్తుంది. అంత చిత్రవిచిత్రమైన ఫోటో ఎలా తీశారబ్బ అనే అనుమానం కూడా కలగకమానదు. ఇక ఆధార్‌ కార్డు మీద ఫోటోల మీద బోలెడు మీమ్స్‌. కానీ ఏం చేస్తాం.. మనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ ఫోటోతేనే అడ్జస్ట్‌ కావాలి. కొన్ని సార్లు గుర్తుపట్టరాని విధంగా ఉన్న ఫోటోలతో సమస్యలు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. కానీ ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఆధార్‌కార్డ్‌ మీద ఫోటోని మార్చుకోవచ్చు. అదెలాగంటే.. 

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చి.. కొత్త దాన్ని అప్‌లోడ్‌ చేయాలంటే.. 
►ఆధార్‌ కార్డ్‌ మీద ఫోటో మార్చడం కోసం ఒక ఫామ్‌ నింపాల్సి ఉంటుంది. దీన్ని కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి సులభంగా యాక్సెస్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

►మీ ఫోటోను మార్చడానికి మీరు మీ ప్రాంతంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి.

►ఇందుకోసం అవసరమైన ఫీజు చెల్లించాలి.

►ఆధార్ నమోదు కేంద్రంలోని సంబంధిత అధికారి మీ  కొత్త ఫోటోను క్లిక్ చేసి, మీ ఆధార్ కార్డుకు అప్‌లోడ్ చేస్తారు.

►ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలోగా మీ ఆధార్‌ కార్డ్‌ మీద కొత్త ఫోటో వస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top