Cii Anarock: ఆన్‌లైన్‌ సేల్స్‌ అదరహో..! అదరగొడుతున్న ఇళ్ల అమ్మకాలు..!

Online Property Sales Increase In Online Says Cii Anarock Consumer Reports - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఆన్‌లైన్‌ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్‌ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్‌లైన్‌ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్‌ కన్జ్యూమర్‌ సర్వే వెల్లడించింది.

పటిష్టమైన ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ బృందం, సోషల్‌ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్‌ వేవ్‌ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్‌ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్‌ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65 శాతం మంది వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు.

వాకింగ్‌ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత..
గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్‌ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్‌ డిజైన్, లొకేషన్‌ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్‌ ట్రాక్స్‌ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్‌ పూల్‌ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు.

చదవండి: రికార్డ్‌ సేల్స్‌: అపార్ట్‌మెంట్లా.. హాట్‌ కేకులా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top