ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వన్‌ప్లస్‌9 ఫీచర్స్‌

Oneplus 9 First Look Goes In Viral - Sakshi

న్యూఢిల్లీ: భారత్ లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వ్యాపించాయి. వచ్చే 2021  మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ కూడా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ఉండనుంది.సెల్ఫీ కెమెరా, ప్రధాన కెమెరా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. అయితే, ఈ మొబైల్ లో కొంచెం పెద్ద 6.55-ఇంచ్ గల ప్యానెల్ కలిగి ఉంటుంది. గత నివేదికలకు విరుద్దంగా, ఈ మొబైల్ లో 144Hz అధిక రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది.

వన్‌ప్లస్ 9 లోని దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో 3 సెన్సార్లు మరియు ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి, రెండు సెన్సార్లు మూడవ దాని కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయి. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్‌కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం. వన్ ప్లస్ సింగిల్ కోర్ స్కోరు 1,122 మరియు మల్టీ కోర్ స్కోరు 2,733 ని సాధించడాన్ని కూడా గీక్ బెంచ్ లిస్టింగ్ హైలైట్ చేసింది. అయితే ఈ మొబైల్ లో వైర్ లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తారా లేదా అనేది ఇంకా సమాచారం లేదు. చివరగా, అన్ని కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లు లెమోనేడ్ అనే కోడ్ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top