Ola Scooter: వామ్మో ఇంత స్పీడా !

Ola CEO Bhavish Aggarwal Gave Hints About Scooter Maximum Speed - Sakshi

హైదరాబాద్‌: ప్రీ బుకింగ్‌లో ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఓలా మరో సారి మార్కెట్‌ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సెగ్మెంట్‌లో అత‍్యధిక స్పీడ్‌తో రాబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. 

ఓలా సీఈవో హింట్స్‌
ఓలా స్కూటర్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ గత కొద్ది కాలంగా ఓలా స్కూటర్‌కి సంబధించిన కీలక సమాచారాన్ని ఒక్కొక్కటిగా సోలష్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా ఓలా స​‍్కూటర్‌ టాప్‌ స్పీడ్‌ ఎంత ఉండాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి అంటూ ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రశ్న సంధించారు. కింద ఆప్ఫన్లుగా గంటకి 80 కి,మీ, 90 కి,మీ, 100కు పైగా కి,.మీలతో పాటు స్పీడ్‌తో పని లేదన్నట్టుగా నాలుగు ఆప్ఫన్లు ఇచ్చారు. ఈ పోల్‌లో సగం మంది వందకు పైగా స్పీడ్‌ కావాలంటూ సమాధానం ఇచ్చారు.

అంచనాలకు మించి
గతంలో ఓలా స్కూటర్‌ ఎన్ని రంగుల్లో వస్తే బాగుంటుందో చెప్పాలంటూ ప్రశ్నించారు భవీష్‌. దానికి సమాధానంగా 9 రంగుల్లో వస్తే బాగుంటుందని నెటిజన్లు సమాధానం ఇచ్చారు. అయితే వారి అంచనాలను మించి ఏకంగా 10 రంగుల్లో ఓలా స్కూటర్‌ని మార్కెట్‌లోకి తేబోతున్నట్టు ఆయన ప్రకటించారు. 

కచ్చితంగా వందకు పైనే
ఓలాకు సంబంధించి కీలక అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తూ వస్తోన్న భవీష్‌ ఈసారి స్పీడ్‌కు సంబంధించిన విషయం బయట పెట్టారని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గరిష్ట వేగం వందకు పైగా ఉండటం అనేది రికార్డేనని చెప్పుకుంటున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

ప్రపంచ రికార్డు
ఇండియాలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బూమ్‌ నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోలు ధరలతో క్రమంగా ఈవీలపైపు ప్రజలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మార్కెట్‌లోకి వస్తోన్న ఓలా ఆది నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. సరికొత్త పంథాలో మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మొదలైన ప్రీ బుకింగ్స్‌లో ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top