ఉల్లి ఎగుమతులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే?

No ban on onion exports commerce ministry clarifies - Sakshi

న్యూఢిల్లీ: ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఆదివారం) తెలిపింది. 2022 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య భారదేశం నుంచి సుమారు 523.8 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లి రవాణా చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఉల్లి విత్తన ఎగుమతిపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఉల్లి ఎగుమతులపైన ఫిబ్రవరి 25న ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిపింది. భారత్ నుంచి సుమారు చాలా దేశాలకు ఉల్లి ఎగుమతి అవుతోందని, ఏ దేశానికీ ఉల్లి ఎగుమతులపై నిషేధం లేదని, అందుకు విరుద్ధంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు దురదృష్టకరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' శనివారం ట్వీట్ చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో ఉల్లి ఎగుమతులు దాదాపు 50 శాతం పెరిగి 52.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 16.3 శాతం పెరిగి 523.8 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఉల్లి ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదు, కానీ ఉల్లి విత్తనాల ఎగుమతిపైన నిషేధం ఉన్నప్పటికీ DGFT నుండి ఆథరైజేషన్ కింద అనుమతించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని బట్టి భారతదేశం నుంచి ఉల్లి ఏ దేశానికైనా ఎగుమతి చేయవచ్చని, దానిపైన ఎటువంటి ఆంక్షలు లేదని స్పష్టమవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top