
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ ఒడిదోడుకుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి తగ్గుతూ వచ్చాయి. ఐటీ, రియాల్టీ స్టాక్స్ బలమైన మద్దతు లభించినప్పటికి తిరిగి అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు. చివరకు, సెన్సెక్స్ 166.96 పాయింట్లు (0.29%) పెరిగి 58,296.91 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 54.20 పాయింట్లు (0.31%) పెరిగి 17,377.80 వద్ద ముగిశాయి.
సుమారు 1657 షేర్లు అడ్వాన్స్ అయితే, 1589 షేర్లు క్షీణించాయి, 165 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.09 వద్ద నిలిచింది. విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ నిఫ్టీ గెయినర్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఐఒసీ, ఇండస్ సింద్ బ్యాంక్, ఒఎన్ జీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ & కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటి & రియాల్టీ సూచీలు 1-3 శాతం పెరిగాయి. (చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే)