మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో సెలెరియో.. ధర ఎంతో తెలుసా?

New-Gen Maruti Suzuki Celerio Launched In India - Sakshi

మారుతి సుజుకి ఇండియా ఎట్టకేలకు కొత్త తరం సెలెరియోను నేడు (నవంబర్ 10, 2021న) భారతదేశంలో విడుదల చేసింది. మారుతి సుజుకి కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే బడ్జెట్ కార్లలో సెలెరియో ఒకటి. దీని కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹4.99 లక్షల నుంచి ₹6.94 లక్షల మధ్య ఉంది. ఇది భారతదేశంలో ప్రారంభించిన రెండవ తరం సెలెరియో. దీని కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభించింది, ఎవరైనా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీ సమీప డీలర్‌షిప్‌లో రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ కారు నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

పవర్ ఫుల్ ఇంజన్
పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారును మారుతి సుజుకి ఇండియా తీసుకొని వచ్చింది. కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ ప్రకటించింది. ఈ కొత్త కారులో 1.0-లీటర్ డ్యూయల్ జెట్‌, డ్యూయల్ వీవీటీ కే10సీ పెట్రోలు ఇంజన్‌ను అమర్చారు. కొత్త-తరం మారుతి సుజుకి సెలెరియో సరికొత్త డిజైన్తో వస్తుంది. ఈ కారు కొత్త స్వెప్ట్-బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ క్లాడింగ్, కొత్త ఫాగ్‌ల్యాంప్‌లతో కూడిన అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది. 

సెలెరియో రెండు కొత్త షేడ్స్‌తో సహా 6 రంగులలో లభిస్తుంది. క్యాబిన్ విషయానికొస్తే.. కొత్త-జెన్ సెలెరియోలో కొత్త ఆల్-బ్లాక్ ఇంటీరియర్, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్‌ ఉంది. ఈ కారులో ఆడియో, టెలిఫోనీ కోసం మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ స్పీడోమీటర్, డిజిటల్ రెవ్ కౌంటర్ ఉన్నాయి. ఈ కారు సిల్వర్ యాక్సెంట్‌లతో కూడిన కొత్త ఎయిర్ కాన్ వెంట్‌లు, మాన్యువల్ ఎయిర్ కాన్ సిస్టమ్, 12వీ ఛార్జర్ కోసం రెండు పోర్ట్‌లు ఉన్నాయి. మధ్యలో స్మార్ట్‌ఫోన్ నావిగేషన్‌తో కూడిన 7-అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కలిగి ఉంది.

ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్
భద్రత పరంగా, AGS/AMT వేరియంట్‌లతో కూడిన ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్‌తో సహా 12కి పైగా సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వస్తుందని మారుతి తెలిపింది. ఇతర ఫీచర్లు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారులో 66 బిహెచ్పీ పవర్, 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయగల ఇంజన్‌ ఉంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది VXI AGS వేరియంట్ అత్యధికంగా 26.68 kmpl మైలేజ్ అందిస్తుంది. Zxi+MT వేరియంట్ 24.97 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 
 

(చదవండి: రక్షణలో రారాజు మహీంద్రా ఎక్స్‌యూ‌వి700)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top